Raghunandan Rao: వకీలుగా మారిన ఎంపీ.. కార్యకర్తల తరఫున రఘునందన్ రావు వాదనలు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు నల్ల కోటు ధరించి కార్యకర్తల తరఫున కేసు వాదించారు. ఇటీవల మెదక్‌లో చోటు చేసుకున్న ఘర్షణలపై కోర్టులో తన వాదనలు వినిపించారు.

Published : 21 Jun 2024 12:00 IST

మెదక్ ఎంపీ రఘునందన్ రావు నల్ల కోటు ధరించి కార్యకర్తల తరఫున కేసు వాదించారు. ఇటీవల మెదక్‌లో చోటు చేసుకున్న ఘర్షణలపై కోర్టులో తన వాదనలు వినిపించారు. నల్ల కోటు ధరించి లాయర్‌గా కార్యకర్తలకు అండగా నిలబడటం ఆసక్తి రేపింది. కోర్టులో వాదనల అనంతరం మాట్లాడిన రఘునందన్ రావు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీగా ఎన్నికైన రఘునందన్ రావును న్యాయవాదులు సన్మానించారు.

Tags :

మరిన్ని