Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కు.. వదినమ్మ సురేఖ ఖరీదైన బహుమతి!

తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan).. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పంచాయతీరాజ్‌ సహా కీలక శాఖలను దక్కించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) కుటుంబాన్ని కలిసేందుకు పవన్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చారు.

Published : 15 Jun 2024 19:13 IST

తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan).. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పంచాయతీరాజ్‌ సహా కీలక శాఖలను దక్కించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) కుటుంబాన్ని కలిసేందుకు పవన్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. సురేఖ స్వయంగా పెన్నును తీసి, పవన్‌ జేబులో పెట్టగా అది చూసి పవన్‌ తెగ సంతోషపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది.

Tags :

మరిన్ని