Anam Ramanarayana: అర్చకుల పారితోషికం పెంపు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఏపీలో దేవాలయాల ప్రతిష్ఠ మరింత పెంచుతామని దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Published : 20 Jun 2024 18:52 IST

ఏపీలో దేవాలయాల ప్రతిష్ఠ మరింత పెంచుతామని దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ శివారులోని గొల్లపూడి దేవదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రిగా ఆనం బాధ్యతలు స్వీకరించారు. రూ.50వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఇస్తున్న రూ.5 వేల నుంచి రూ.10 వేల పెంచుతూ తొలి సంతకం చేశారు. అర్చకుల పారితోషికాన్ని రూ.7వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. 

Tags :

మరిన్ని