YSR District: పొలంలో విద్యుత్‌ తీగలు.. అన్నదాత అవస్థకు 3 గంటల్లోనే మంత్రి పరిష్కారం!

సమస్యలకు స్పందించే ప్రభుత్వముంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన గంగయ్య ఘటనే ఉదాహరణగా నిలిచింది. వైకాపా అధినేత జగన్  గతంలో సీఎంగా పని చేసినా.. ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పలు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు. కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల్లోనే ఆ అన్నదాత సమస్య తీరి ఆయన మోములో ఆనందం వెల్లివిరిసింది.

Published : 10 Jul 2024 14:18 IST

సమస్యలకు స్పందించే ప్రభుత్వముంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన గంగయ్య ఘటనే ఉదాహరణగా నిలిచింది. వైకాపా అధినేత జగన్  గతంలో సీఎంగా పని చేసినా.. ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పలు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు. కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల్లోనే ఆ అన్నదాత సమస్య తీరి ఆయన మోములో ఆనందం వెల్లివిరిసింది. ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన గంగయ్య పొలంలో విద్యుత్తు తీగలు నేలను తాకుతుండేవి. ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి రైతు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇటీవల వర్షాలు పడడంతో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం రైతు పొలానికి వెళ్లారు. ఎప్పటిలాగానే తీగలను పైకెత్తి.. దుక్కి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు ఈటీవీలోనూ వార్త ప్రసారం కావడం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన.. జిల్లా S.P.D.C.L ఎస్ఈ రమణతో ఫోన్లో మాట్లాడి.. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆగమేఘాలపై ఎస్‌ఈ తమ సిబ్బంది ద్వారా విద్యుత్తు స్తంభాన్ని పొలానికి పంపించి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు.

Tags :

మరిన్ని