TS News: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట వెనుక కుట్ర: మంత్రి కొండా సురేఖ

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Published : 10 Jul 2024 10:09 IST

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజకీయ ప్రేరేపిత అరాచక శక్తులు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పన్నాగం పన్నాయని ధ్వజమెత్తారు. బల్కంపేట అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తుల ఇబ్బందులపై హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు. బోనాల ఉత్సవాల్లో భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు వరస సమావేశాలు నిర్వహించినా ఇలాంటి ఘటనలు జరగడం తగదని సూచించారు. ఓ మహిళా జర్నలిస్టును ఎస్సై దుర్భాషలాడటంపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవడం సహా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అల్లరిమూకల తోపులాట తర్వాత సేద తీరేందుకు ఓ గద్దెపై కూర్చుంటే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చొన్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Tags :

మరిన్ని