Nadendla Manohar: రేషన్‌ సరకుల పంపిణీలో మోసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్

పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరఫరా చేసే సరకుల పంపిణీలో మోసం చేసినవారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Updated : 18 Jun 2024 16:54 IST

పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరఫరా చేసే సరకుల పంపిణీలో మోసం చేసినవారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరకుల తూకాల్లో అక్రమాలకు పాల్పడినవారు సహా.. వారి వెనక ఉన్నవారినీ వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో తాను తనిఖీ చేసినపుడు కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో  50 నుంచి 80 గ్రాములు తక్కువగా ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదని, పారదర్శకంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Tags :

మరిన్ని