Nimmala Ramanaidu: జగన్‌ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి: మంత్రి నిమ్మల

జగన్‌ హయాంలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Published : 10 Jul 2024 13:05 IST

జగన్‌ హయాంలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్‌ గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పట్టిసీమను వట్టిసీమన్న జగన్‌.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని