Ponnam Prabhakar: అలక కాదు.. పరిస్థితిపై సమీక్షించాం: మంత్రి పొన్నం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో తాను అలకబూనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు.

Updated : 09 Jul 2024 16:33 IST

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో తాను అలకబూనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి స్వాగతం పలికే సమయంలో తోపులాట జరిగింది. అదే సమయంలో మంత్రితో పాటు మేయర్ విజయలక్ష్మి సైతం ఉన్నారు. తోపులాటలో మేయర్‌ కింద పడిపోయే పరిస్థితి నెలకొందని, మహిళలకు సైతం ఇబ్బంది కలిగిందని మంత్రి తెలిపారు. పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని ఓ గర్భిణి జర్నలిస్టు ఫిర్యాదు చేసిందని, అందుకే అధికారులతో సమీక్షించడానికి.. పరిస్థితిని చక్కదిద్దటానికే బయట కూర్చొన్నామని మంత్రి పొన్నం వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు