Ap News: పురపాలక కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ.. కమిషనర్‌పై ఆగ్రహం

మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీలు చేశారు.

Published : 20 Jun 2024 17:09 IST

మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టకపోవటంతో కమిషనర్ ప్రసన్న వాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయాలని చెప్పి 5 రోజులవుతున్న ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం.. ఉన్నత పాఠశాలను బాలికల కాలేజీగా మార్చే దిశగా త్వరలోనే ప్రయత్నం చేస్తానని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని