Kadiyam Srihari: రాజకీయ వలసలపై మాట్లాడే నైతికత భారాసకు లేదు: కడియం శ్రీహరి

రాజకీయ వలసలపై మాట్లాడే నైతికత భారాస నాయకులకు లేదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు.

Published : 11 Jul 2024 17:24 IST

రాజకీయ వలసలపై మాట్లాడే నైతికత భారాస నాయకులకు లేదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే ముందు గతంలో భారాస ఏం చేసిందో గుర్తుచేసుకోవాలన్నారు. అవినీతి, అహంకారం వల్లే రాష్ట్రంలో భారాస ఓడిపోయిందన్నారు. పదేళ్ల భారాస పాలన అవినీతిమయమని కడియం ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం ఈ మేరకు మాట్లాడారు.

Tags :

మరిన్ని