Kasu Maheshreddy: కొంతమంది నేతల నోటి దురుసూ మా ఓటమికి కారణమే: వైకాపా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి

ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి (Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Updated : 23 Jun 2024 14:37 IST

ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి (Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయింది. మద్యం తాగే వాళ్లు మాకు ఓటేయలేదు. పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణం. తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారు. అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు తెదేపా శ్రేణుల్లో కసిని పెంచాయి. మా ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటాం’’ అని కాసు మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

మరిన్ని