AP Assembly: ఒకే సభలో ఏకకాలంలో ఎమ్మెల్యేలుగా కుటుంబ, సన్నిహిత బంధుగణం

తండ్రీ కొడుకులు ఒకే సభలో కొలువుదీరిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభలో చోటుచేసుకుంది.

Updated : 22 Jun 2024 17:36 IST

తండ్రీ కొడుకులు ఒకే సభలో కొలువుదీరిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా ఆయన తనయుడు నారా లోకేశ్‌ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోనూ ఇలాంటి అరుదైన ఘటన పలుమార్లు చోటుచేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలు ఎమ్మెల్యేలుగా సభలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉండడంతో పాటు వియ్యంకులైన చంద్రబాబు, బాలకృష్ణలు వరుసగా మూడు సభల్లో ఎమ్మెల్యేగా ఉంటూ హ్యాట్రిక్ సాధించారు. మామా అల్లుడు అయిన బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ఒకే సారి శాసనసభ్యులుగా ఉన్న అరుదైన ఘటన ఈ సభలో చోటుచేసుకుంది. వియ్యంకులైన నారాయణ, గంటా శ్రీనివాసరావులు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఈ సభలో నిలవగా వియ్యంకులే అయిన గంటా శ్రీనివాసరావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు రెండో సారి ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉన్నారు. 

Tags :

మరిన్ని