MLC Jeevan Reddy: కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్‌ రెడ్డి

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై తాను మనస్తాపానికి గురయ్యానని మరోసారి జీవన్ రెడ్డి వెల్లడించారు.

Published : 25 Jun 2024 13:11 IST

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై తాను మనస్తాపానికి గురయ్యానని మరోసారి జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు.. బేగంపేట్‌లోని జీవన్‌ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అతి త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని