Jeevan Reddy: రాజీనామా యోచనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ప్రభుత్వ విప్ బుజ్జగింపు!

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

Updated : 24 Jun 2024 16:32 IST

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. భారాసకు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. తనకు సమాచారం లేకుండా ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

Tags :

మరిన్ని