Hyderabad: కొత్త పుంతలు తొక్కుతున్న రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి.

Published : 22 Jun 2024 09:49 IST

రైస్ మిల్లింగ్ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి రైస్ మిల్లింగ్ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునికీకరణ పరిచయం చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సాగుతోంది. రైస్ మిల్లుల సాంకేతికత, బియ్యం తెల్లబడే యంత్రాలు, ప్రీ- క్లీనర్ మెషినరీ, గ్రేడర్ మెషినరీ, వరి వేరు యంత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

Tags :

మరిన్ని