BJP: తెలంగాణ భాజపా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

తెలంగాణ భాజపా (BJP) అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది.

Published : 19 Jun 2024 12:50 IST

తెలంగాణ భాజపా (BJP) అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు అధ్యక్ష పీఠం కోసం దిల్లీలో మకాం వేసి లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కమలం పార్టీలో కొత్త చిక్కు వచ్చిపడింది. పాత, కొత్త అనే పంచాయితీ మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు కట్టబెట్టారు కాబట్టి తమకు పార్టీ పదవీ బాధ్యతలైనా ఇవ్వాలనే డిమాండ్ సీనియర్‌ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ర్ట రథసారధి నియామకంపై అధిష్ఠానం డైలామాలో పడినట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని