MP Balasowri: ‘వై నాట్‌’.. అంటే అలాంటి ఆలోచనలు రావాలి!: ఎంపీ బాలశౌరి

కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జనసైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Published : 13 Jun 2024 15:06 IST

కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జనసైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన.. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తానని బాలశౌరి తెలిపారు.

Tags :

మరిన్ని