Arvind: నీట్ పరీక్షలో తప్పిదాలతో కొంత ఇబ్బందికర పరిస్థితి: ఎంపీ ధర్మపురి

నీట్ పరీక్షలో తప్పిదాలతో కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

Published : 22 Jun 2024 19:58 IST

నీట్ పరీక్షలో తప్పిదాలతో కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఎన్నికలు ఉండడంతో కాస్త తప్పిదం జరిగిందని.. మోదీ ప్రభుత్వం గుర్తించి విచారణ చేస్తోందని వివరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ముఖ్యకార్యకర్తల భేటీకి హాజరైన ఆయన.. భారాస ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో భాజాపా బలంగా పుంజుకునే అవకాశం ఉందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాని మరింత బలోపేతం చేస్తామని అర్వింద్ తెలిపారు.

Tags :

మరిన్ని