MP Raghunandan: పటాన్‌చెరు, సంగారెడ్డికి మెట్రో రైలును తీసుకొచ్చే బాధ్యత నాది: ఎంపీ రఘునందన్‌ రావు

పటాన్‌చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రైలును తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకున్నట్టు మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు చేపట్టాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆయన కోరారు.

Published : 18 Jun 2024 15:31 IST

పటాన్‌చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రైలును తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకున్నట్టు మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు చేపట్టాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేసి.. మొదటి దశలో పటాన్‌చెరు, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలును విస్తరించాలని విజ్ఞప్తి చేస్తూ మెట్రో భవన్‌లో ఎన్వీఎస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత తాను చేపట్టిన తొలి కార్యక్రమం ఇదేనని రఘునందన్ రావు పేర్కొన్నారు. 30 రోజుల్లో డీపీఆర్‌లు సిద్ధం చేసి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తానని మెట్రో ఎండీ హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడి.. పనులు త్వరగా జరిగేటట్టు చూస్తానని రఘునందన్ రావు తెలిపారు.

Tags :

మరిన్ని