Raghunandan: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దళితుల భూముల్ని లాక్కొన్నారు: ఎంపీ రఘునందన్‌రావు

సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను అప్పటి కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దోచుకున్నారని భాజపా ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు.

Published : 14 Jun 2024 16:22 IST

సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను అప్పటి కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దోచుకున్నారని భాజపా ఎంపీ రఘునందన్‌రావు (Raghunandanrao) ఆరోపించారు. ధరణి పోర్టల్‌ అధికారాలతో పేదల భూములు లాక్కొని రియల్టర్లకు అప్పగించారని మండిపడ్డారు. ఈ విషయంపై బాధితుల నుంచి అనేక సార్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్‌ డిమాండ్‌ చేశారు. వెంకట్రామిరెడ్డిని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాపాడుతున్నారని ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని