Nag Ashwin: శ్రీకృష్ణుడిగా మహేశ్‌బాబు.. ఎలా ఉంటుందంటే?: నాగ్‌ అశ్విన్‌

‘కల్కి 2898 ఏడీ’లో శ్రీ కృష్ణుడి పాత్రలో మహేశ్‌ బాబు (Mahesh Babu) నటిస్తే బాగుంటుందని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) స్పందించారు.

Published : 06 Jul 2024 13:31 IST

‘కల్కి 2898 ఏడీ’లో శ్రీ కృష్ణుడి పాత్రలో మహేశ్‌ బాబు (Mahesh Babu) నటిస్తే బాగుంటుందని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) స్పందించారు. ‘కల్కి’ సెట్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘కల్కి’లో శ్రీకృష్ణుడి పాత్రలో మహేశ్‌బాబును తీసుకునే అవకాశం ఉందా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘ఇందులో కాదు గానీ వేరే సినిమాలో ఆయన కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుంది’ అని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని