Nag Ashwin: ‘కల్కి’ పార్ట్‌ 2లో ప్రభాస్‌ నెగటివ్‌గా కనిపిస్తారా?.. నాగ్‌ అశ్విన్‌ సమాధానమిదే!

‘కల్కి 2898 ఏడీ’ విజయంపై ఆనందం వ్యక్తం చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ఆ సినిమా పార్ట్‌ 2 గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 06 Jul 2024 12:52 IST

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసిన నాగ్‌ అశ్విన్‌.. పార్ట్‌ 2 గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ మూవీ సెట్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘పార్ట్‌ 1లో ప్రభాస్‌ను కర్ణుడిగా చూపించారు. పార్ట్‌ 2లో ఆయన్ను నెగెటివ్‌గా చూపించనున్నారా?’ అనే ప్రశ్నకు నాగ్‌ అశ్విన్‌.. ‘పార్ట్‌ 1 క్లైమాక్స్‌లో కర్ణుడి పాత్ర ఏ కోణంలోనూ నెగెటివ్‌గా లేదు. పార్ట్‌ 2లోనూ అంతే’ అని సమాధానమిచ్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు