Nagababu: వైకాపా ప్రేరేపిత వ్యక్తులు కూటమిపై విషప్రచారం చేస్తున్నారు: నాగబాబు

తెదేపా-జనసేన-భాజపా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం జరుగుతోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని జనసేన నేత నాగబాబు (Nagababu) తెలిపారు.

Published : 14 Jun 2024 13:56 IST

తెదేపా-జనసేన-భాజపా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం జరుగుతోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని జనసేన నేత నాగబాబు (Nagababu) తెలిపారు. వైకాపా ప్రేరేపిత వ్యక్తులు కొంతమంది అసత్య వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విష ప్రచారాన్ని సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమికి‌ చెందిన మూడు పార్టీల అధినేతలు సమష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారని తేల్చిచెప్పారు. 

Tags :

మరిన్ని