Ramoji Rao: రామోజీరావు సాహస ప్రవృత్తి అనితర సాధ్యం: ఎం.నాగేశ్వరరావు

క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు.

Published : 16 Jun 2024 13:02 IST

క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘కఠినమైన క్రమశిక్షణ రామోజీరావు మొదటి లక్షణం. కలలో కూడా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. 39 సంవత్సరాలు ఛైర్మన్‌తో కలిసి ప్రయాణించా. విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆయన నిర్మించారు. తెలుగువారికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు’’ ఆయన పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని