Pawan Kalyan: పంచాయతీలను ముంచి.. రూ.5,500కోట్ల నిధులను మళ్లించిన వైకాపా ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం రూ.5,500 కోట్లు మళ్లించేసింది.

Published : 21 Jun 2024 09:49 IST

కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం రూ.5,500 కోట్లు మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించినవే రూ.3,198 కోట్లు ఉన్నాయి. మిగతా రూ.2,302 కోట్లు జిల్లా, మండల పరిషత్తులకు ఇచ్చినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు