Polvaram Project: కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే కేంద్ర జలసంఘం మొగ్గు

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు.

Updated : 04 Jul 2024 12:01 IST

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. కొత్త డయాఫ్రం వాల్‌ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు ఎంత దూరంలో కట్టాలి? ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు.

Tags :

మరిన్ని