PM Modi: యోగా.. కోట్లమందికి దైనందిన కార్యక్రమమైంది: ప్రధాని మోదీ

యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్-ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

Updated : 21 Jun 2024 15:32 IST

యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్-ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 50 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకొంటున్నామన్న మోదీ.. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఒక్క జర్మనీలోనే నిత్యం కోటిమందికి పైగా యోగా చేస్తున్నారని వివరించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని గుర్తుచేశారు. 

Tags :

మరిన్ని