Nilgiri Mountain Railway: నీలగిరి మౌంటెన్‌ రైల్వేకు 125ఏళ్లు

తమిళనాడులోని నీలగిరి. పచ్చని పర్వత సానువులు, అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య నడిచే మౌంటెన్‌ రైలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా పొందిన ఈ రైలు సర్వీసు 125ఏళ్లను పూర్తి చేసుకుంది.

Published : 24 Jun 2024 13:00 IST

ఒకప్పుడు చిన్నపిల్లలు రైలు ఆట ఆడుకుంటే.. ‘కూ.. చుక్ చుక్’ అన్న పదం తప్పనిసరిగా ఉండేది. కారణం రైళ్లు అప్పుడు ఆవిరి ఇంజిన్లతో నడవడం, తద్వారా శబ్దం అలా రావడమే. సాంకేతికత రాకతో ఇప్పుడు ఆవిరి ఇంజిన్లు మాయమై డీజిల్, విద్యుత్‌తో నడిచే రైళ్లు వచ్చేశాయి. దాంతో చుక్ చుక్ మోతలూ వినిపించడం ఆగిపోయింది. ఐతే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఆ మోతలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి తమిళనాడులోని నీలగిరి. పచ్చని పర్వత సానువులు, అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య నడిచే మౌంటెన్‌ రైలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా పొందిన ఈ రైలు సర్వీసు 125ఏళ్లను పూర్తి చేసుకుంది. మరి మనమూ ఆ రైలు విశేషాలను, ప్రకృతి అందాలను చూసొద్దామా.

Tags :

మరిన్ని