Nita Ambani: కాశీలోని స్థానిక దుకాణంలో చాట్‌ తిన్న నీతా అంబానీ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీకి, రాధికా మర్చంట్‌తో జూలై 12న వివాహం జరగనున్న వేళ.. వారణాసిలో ముకేశ్ సతీమణి నీతా అంబానీ పర్యటించారు.

Updated : 25 Jun 2024 17:07 IST

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీకి, రాధికా మర్చంట్‌తో జూలై 12న వివాహం జరగనున్న వేళ.. వారణాసిలో ముకేశ్ సతీమణి నీతా అంబానీ పర్యటించారు. ముందుగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వివాహ ఆహ్వాన పత్రికను విశ్వనాథుడికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత కాశీకి వచ్చానని.. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉందని నీతా అంబానీ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతా అంబానీకి ఓ వ్యక్తి.. విశ్వనాథ ఆలయ నమూనాను బహూకరించారు. అనంతరం నీతా.. ఓ స్థానిక చాట్ దుకాణానికి వెళ్లారు. అక్కడ పాలక్ చాట్‌ను రుచి చూశారు.

Tags :

మరిన్ని