AP news: ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.

Published : 21 Jun 2024 19:15 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలిస్, సెయింట్ పాల్‌లో ఎన్నారై కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఏపీలో కూటమి విజయం కోసం కష్టపడిన ఎన్నారై నేతలకు తణుకు ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.  

Tags :

మరిన్ని