TS News: రైతుభరోసా విధివిధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ

రైతుభరోసా విధివిధానాల రూపకల్పన కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది.

Published : 10 Jul 2024 17:13 IST

రైతుభరోసా విధివిధానాల రూపకల్పన కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఖమ్మంలో జరిగిన రైతుభరోసా వర్క్‌షాప్‌లో మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజాధనం పక్కదారి పట్టకుండా అర్హులైన చిన్న, సన్నకారు అన్నదాతలకే రైతుభరోసా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనల మేరకే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు తుమ్మల, పొంగులేటి వివిరించారు.

Tags :

మరిన్ని