పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. నూనె కోసం బకెట్లతో ఎగబడ్డ జనం

పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. పామాయిల్‌ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో స్థానికులు ఎగబడ్డారు.

Published : 19 Jun 2024 10:51 IST

పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. నూనె కోసం బకెట్లతో ఎగబడ్డ జనం

పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్‌ బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్‌ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించారు.

Tags :

మరిన్ని