PM Modi: మోదీ ‘తాడాసనం’.. గ్రాఫిక్‌ వీడియో షేర్ చేసిన ప్రధాని

త్వరలో 10వ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహించుకోనున్న తరుణంలో ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఓ గ్రాఫిక్‌ వీడియోను షేర్ చేశారు. ‘తాడాసనం’ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందులో వివరించారు. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్.. ‘తాడాసనం’ ఎలా వేయాలో చూపిస్తోంది. దానివల్ల కలిగే ప్రయోజనాలు పేర్కొంది.

Published : 13 Jun 2024 15:17 IST

త్వరలో 10వ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహించుకోనున్న తరుణంలో ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఓ గ్రాఫిక్‌ వీడియోను షేర్ చేశారు. ‘తాడాసనం’ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందులో వివరించారు. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్.. ‘తాడాసనం’ ఎలా వేయాలో చూపిస్తోంది. దానివల్ల కలిగే ప్రయోజనాలు పేర్కొంది. ఈ ఆసనం శరీరానికి ఎంతో మంచిదని, శరీర భాగాల స్థితిని ఓ క్రమంలో ఉంచటానికి ఉపకరిస్తుందని ప్రధాని మోదీ ఆ వీడియోకు ఒక వ్యాఖ్యను జతచేశారు. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం జూన్ 21న యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాసలో భారత్ ప్రతిపాదించగా.. అందుకు అన్నిదేశాలు ముక్త కంఠంతో ఆమోదం తెలిపాయి.

Tags :

మరిన్ని