Kaleshwaram: కాళేశ్వరం డ్యామ్‌ల అన్ని అంశాలపై సమాంతర విచారణ

కాళేశ్వరం ఆనకట్టలపై ఏర్పాటైన న్యాయ కమిషన్.. అన్ని అంశాలపై సమాంతరంగా విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది.

Published : 13 Jun 2024 20:12 IST

కాళేశ్వరం ఆనకట్టలపై ఏర్పాటైన న్యాయ కమిషన్.. అన్ని అంశాలపై సమాంతరంగా విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇంజనీర్లు, ఇతరుల విచారణ కొనసాగిస్తూనే నిపుణుల నుంచి పరిశీలన అంశాలను సేకరిస్తోంది. ఇతర రూపాల్లోనూ అవసరమైన సమాచారాన్ని తీసుకునే పనిలో నిమగ్నమైంది. మొదట సాంకేతికపరమైన అంశాలపై, ఆ తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుంది. సాక్ష్యాలు పక్కాగా ఉండేలా అఫిడవిట్లు స్వీకరిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్.. అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. నివేదిక రూపకల్పన పైనా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

Tags :

మరిన్ని