Darshan case: ఏ1గా పవిత్రగౌడ.. ఏ2గా దర్శన్‌.. రేణుకస్వామి హత్య కేసులో కీలక విషయాలు!

కర్ణాటకలో సంచలనంగా మారిన చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేయగా 28 ప్రదేశాల్లో వారిని మహజరు చేసిన అధికారులు 139కీ పైగా సాక్ష్యాలను సేకరించారు.

Published : 22 Jun 2024 11:49 IST

రేణుకస్వామిని హత్య చేసిన తర్వాత దర్శన్ తన సన్నిహితులకు ఫోన్ చేసినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చట్టపరమైన ఇబ్బందులను తొలగించేందుకు, సాక్ష్యాలను మాయం చేసేందుకు, వీలుగా తన స్నేహితుడి దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు తీసుకోగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో పవిత్ర గౌడను ఏ1గా, దర్శన్‌ను ఏ2గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని