Pawankalyan: డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్‌

కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawan Kalyan) మంత్రివర్గ శాఖల పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు.

Updated : 14 Jun 2024 17:27 IST

కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawan Kalyan) మంత్రివర్గ శాఖల పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాతో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అమాత్యులుగా నియమించారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతల సమావేశంలో పవన్‌కు దాదాపు సీఎం స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యతలు కల్పిస్తామని చెప్పినట్లుగానే సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్ని అప్పగించారు.

Tags :

మరిన్ని