Pocharam: పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే కాంగ్రెస్‌లోకి: పోచారం శ్రీనివాసరెడ్డి

పదవుల కోసం కాదు, పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Published : 21 Jun 2024 14:19 IST

    పదవుల కోసం కాదు, పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పోచారం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్‌ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించినట్లు చెప్పారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతుబిడ్డనని.. అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు