Devineni Uma: జగన్ నిర్లక్ష్యం వల్లే అనిశ్చితిలో పోలవరం!: వీడియో పోస్ట్‌ చేసిన దేవినేని ఉమా

జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను దేవినేని తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Published : 19 Jun 2024 19:38 IST

జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. శాఖలు కేటాయించిన మంత్రులకు ప్రాజెక్టే అర్థం కాలేదని చెప్పడం దారుణమన్నారు. ఐదేళ్లలో పురోగతి లేకపోగా.. ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే.. నాలుగేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రివర్స్ టెండరింగ్‌తో జగన్ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని, ప్రజా శ్రేయస్సును గాలికొదిలేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను దేవినేని తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Tags :

మరిన్ని