Hyderabad: దొంగతనం బెడిసికొట్టింది.. పోలీసులకు దొరికేశారు!

ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠా.. దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు. అది కాస్తా బెడిసికొట్టి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు.

Updated : 17 Jun 2024 12:33 IST

ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠా.. దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు. అది కాస్తా బెడిసికొట్టి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో నేరగాళ్ల పథకం విని పోలీసులే నోరెళ్ల బెట్టారు.

Tags :

మరిన్ని