Hyderabad: దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పెద్ద అంబర్‌పేట సమీపంలో పోలీసుల కాల్పులు

దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు.

Published : 05 Jul 2024 12:43 IST

దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్‌ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా యత్నించారు. పెద్దఅంబర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ వద్దకు వచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Tags :

మరిన్ని