Chandrababu: అలుపెరగని నాయకుడు.. చంద్రబాబు రాజకీయ ప్రస్థానమిది

నాలుగున్నర దశాబ్దాల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం సంక్షోభాలు, సంఘర్షణలు, పోరాటాలు, విజయాల సమ్మిళితం. 2024 ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దార్శనికుడు. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న రాజకీయ దురంధరుడు. ఆయనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.

Published : 12 Jun 2024 10:05 IST

ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి... నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న దార్శనికుడు.. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న నేత చంద్రబాబు..! ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి.. జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి, చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఆయన నైజం. 

Tags :

మరిన్ని