Chandrababu: అనితకు హోం.. మంత్రులకు శాఖల కేటాయింపుల్లో సీబీఎన్‌ మార్క్‌!

మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు.

Published : 14 Jun 2024 17:26 IST

మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు. పవన్‌కల్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా సహా మరికొన్ని శాఖలు కేటాయించారు. లోకేశ్‌కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు. తెదేపా ప్రభుత్వంలో తొలిసారిగా వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ ఇచ్చారు. సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, మంత్రులకు కేటాయించని శాఖలను సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తారు.

Tags :

మరిన్ని