Nirmal: నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కోతలు.. చీకట్లలోనే రోగులకు వైద్యం

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోతలు.. రోగులతో పాటు వారి సహాయకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆదివారం ఉదయం నుంచి కరెంట్ వస్తూపోతూ ఉండడంతో అవస్థలు పడ్డామని రోగులు వాపోయారు.

Published : 24 Jun 2024 11:37 IST

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోతలు.. రోగులతో పాటు వారి సహాయకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆదివారం ఉదయం నుంచి కరెంట్ వస్తూపోతూ ఉండడంతో అవస్థలు పడ్డామని రోగులు వాపోయారు. సాయంత్రం చీకటయ్యాక ఉక్కపోతతో ఆస్పత్రిలో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. వైద్యశాల సిబ్బంది సైతం సెల్‌ఫోన్ వెలుగులలో పనులు చేసుకున్నారని రోగులు చెప్పారు. అత్యవసర సేవలు అందించే ఐసీయూ, పిల్లల విభాగంలో ఇన్వర్టర్ సాయంతో కరెంటు అవసరాలు తీరినా జనరల్ వార్డులు, ఇతర విభాగాల్లో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడ్డామని రోగుల సహాయకులు వెల్లడించారు. ఆసుపత్రి అవసరాల నిమిత్తం జనరేటర్ ఏర్పాటు చేసినా అది సక్రమంగా పనిచేయకపోవడంతోనే ఈ దుస్ధితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా ప్రధాన ఆసుపత్రి సహా బోధానసుపత్రిగా ఉన్నచోట ఈ తరహా దుస్ధితి నెలకొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని