Priyanka Gandhi: వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు.

Published : 14 Jun 2024 17:24 IST

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. దీంతో వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే వయనాడ్‌ (Wayanad) స్థానాన్ని ఆయన వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకొంది. అంతేకాదు.. ఇక్కడి నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

మరిన్ని