Professor Kodandaram: పోటీ పరీక్షల అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం: ప్రొఫెసర్‌ కోదండరామ్‌

పోటీ పరీక్షల అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తున్నామని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో కలిసి.. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

Published : 09 Jul 2024 15:26 IST

పోటీ పరీక్షల అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తున్నామని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో కలిసి.. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన, ఆవేదన గురించి వివరించినట్టు తెలిపారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలనే అభ్యర్థుల డిమాండ్‌ను సైతం కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఈ మేరకు కోదండరామ్‌ ఓ వీడియోను విడుదల చేశారు. 

Tags :

మరిన్ని