Puri Jagannath Rath Yatra: కనులపండువగా పూరీ జగన్నాథుడి రథయాత్ర

ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 5 గంటలకు బలభద్రుని తాళధ్వజ రథం గుండిచా దేవీ ఆలయానికి బయలు దేరింది. భక్తులు ఉత్సాహంగా రథం లాగారు. తర్వాత సుభద్రదేవి దర్పదళన్‌ రథం బయలుదేరింది. జగన్నాథుని నందిఘోష్‌ రథాన్ని 5 అడుగుల దూరం లాగి ఉంచేశారు.

Published : 08 Jul 2024 09:47 IST

ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 5 గంటలకు బలభద్రుని తాళధ్వజ రథం గుండిచా దేవీ ఆలయానికి బయలు దేరింది. భక్తులు ఉత్సాహంగా రథం లాగారు. తర్వాత సుభద్రదేవి దర్పదళన్‌ రథం బయలుదేరింది. జగన్నాథుని నందిఘోష్‌ రథాన్ని 5 అడుగుల దూరం లాగి ఉంచేశారు. నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఉత్సవాలు ఒకేరోజు కావడంతో రాత్రయ్యేలోపు రథాలు గుండిచాదేవి సన్నిధికి చేరుకోలేదు. సూర్యాస్తమయం తర్వాత యాత్ర కొనసాగించొద్దనే నిబంధన ఉండటంతో బొడొదండొలో మార్గమధ్యలో నిలిపేశారు. దీంతో సోమవారం రథయాత్రను కొనసాగిస్తున్నారు. రథాలను గుండిచా మందిరం వద్దకు చేర్చనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు