Putin-Kim Jong un: పుతిన్‌తో కలిసి కారులో కిమ్‌ షికారు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనలో ఆసక్తికర  సన్నివేశం జరిగింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్..  పుతిన్‌ను పక్కనే కూర్చోబెట్టుకుని స్వయంగా కారు నడిపారు. అదే కారును పుతిన్ సైతం నడిపారు.

Published : 20 Jun 2024 17:25 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనలో ఆసక్తికర  సన్నివేశం జరిగింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్..  పుతిన్‌ను పక్కనే కూర్చోబెట్టుకుని స్వయంగా కారు నడిపారు. అదే కారును పుతిన్ సైతం నడిపారు. బుధవారం రష్యా, ఉత్తర కొరియా మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే.. పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అనంతరం ఓ కారును కిమ్‌కు పుతిన్ బహుమతిగా ఇచ్చారు. అందుకు బదులుగా కిమ్ కూడా పలు ఖరీదైన వస్తువులతో పాటు రెండు శునకాలను పుతిన్‌కు బహుమతిగా ఇచ్చారు.

Tags :

మరిన్ని