PV Ramesh: చంద్రబాబు సమర్థతతో ఏపీ ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది: పీవీ రమేశ్‌

ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కొత్త ప్రభుత్వానికి సవాలే అయినప్పటికీ.. సీఎం చంద్రబాబు సమర్థత, అనుభవంతో గాడిన పడుతుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 14 Jun 2024 14:14 IST

ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కొత్త ప్రభుత్వానికి సవాలే అయినప్పటికీ.. సీఎం చంద్రబాబు సమర్థత, అనుభవంతో గాడిన పడుతుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టొచ్చని చెప్పారు. అయితే దానికి కొంత సమయం పడుతుందని, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. పాలసీలన్నీ సమీక్షించి సొంత రాబడులను పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. కేంద్రం కూడా నిధుల విషయంలో సహకరిస్తుందని పీవీ రమేశ్‌ అభిప్రాయపడ్డారు. ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లలో ఖర్చు చేస్తే రానున్న అయిదేళ్లలో రాష్ట్రం గణనీయ వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని