Tirumala: తిరుమల శ్రీవారి సేవలో రఘురామ, సి.ఎం.రమేశ్‌

తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సిం.ఎం.రమేశ్‌, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు.

Updated : 14 Jun 2024 14:58 IST

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి అభిషేక సేవలో అనకాపల్లి ఎంపీ సిం.ఎం.రమేశ్‌, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju), మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్ వేర్వేరుగా పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి రఘురామ, సీఎం రమేశ్‌, గవర్నర్‌ రమేశ్‌బైస్‌లు మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని