Wayanad: వయనాడ్‌పై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుంటానని రాహుల్‌గాంధీ ప్రకటించడంతో కాంగ్రెస్, భాజపా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

Updated : 18 Jun 2024 20:23 IST

వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుంటానని రాహుల్‌ గాంధీ ప్రకటించడంతో కాంగ్రెస్, భాజపా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి రాహుల్‌ గాంధీ వయనాడ్ ఓటర్లను మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరా స్థానాన్ని విడిచిపెట్టి అక్కడి ఓటర్లను మోసం చేయలేదా అని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. వయనాడ్ ఓటర్లకు రాహుల్ గాంధీ అన్యాయం చేశారని ఆయనపై పోటీ చేసి ఓడిన సీపీఐ అభ్యర్థి అన్ని రాజా విమర్శించారు.

Tags :

మరిన్ని